Sunday, February 6, 2011

అయ్యా ఉండవల్లి గారూ !

అయ్యా ఉండవల్లి గారూ ! ఈ మధ్య మిమ్మల్ని అందరూ ఊసరవెల్లి తో పోలిస్తే నాకు చాల భాధగా ఉంది. పాపం ఊసరవెల్లి బ్రతకటం కోసం రంగులు మారుస్తుంది. అది దాని జీవ ధర్మం. మరి మీరు ఎందుకు మార్చారో ఆ దేవుడికే తెలియాలి. నాకు తెలిసి మీరు డబ్బు కోసం లేదా పదవుల కోసం కక్కుర్తి పడే మనిషి కాదు(అని అనుకునే వాణ్ణి). మరి ఎందుకీ వెన్ను పోటు?

పాపం వై.ఎస్. - చెంత చేరినవారికి " వై (WHY?) అని అడగకుండా ఎస్ (YES) అనే వ్యక్తిత్వం ఉన్న గొప్ప మారాజు. ఎంత మందినో అనామకులను నాయకులు గా పెంచి పెద్దచేసిన రా రాజు. ఆయన మరణం తరువాత ఒక్కొక్కరే "నమ్మిన" బంటులందరూ ఆయన వ్యక్తిత్వాన్ని, ఆత్మని కుళ్ళబొడుస్తున్నారు. ఎన్ని aపవాడులోచ్చినా సరే వెన్నంటే ఉన్న వీరుడిని, ఆయన కుటుంబాన్ని మీరు వెన్ను పోటు పొడవటం చరిత్ర పుస్తకాల్లోకి ఎక్క వలసిన పాఠం. రాజన్నని అంత మంది అన్ని మాటలంటే బయటకి రాణి మీ మొగతనం, చిరునంటే పొడుచుకు వచ్చిందా? ఇంత దిగజారుడుతనం ఎందుకు? కనీసం వీ.హెచ్., కాకా వాళ్ళు తెలుగుదేశం లేని రోజుల్లో కాంగ్రెస్ టికెట్ మీద కుల బలంతోనో ధనబలం తోనో గెలిచారు. మీకు ఆ శక్తి కూడా లేదు. ఆ రోజుల్లోనే ఒక వార్డు కౌన్సిలర్ గా గెలిచుండే వారు కాదు. అలాంటి మిమ్మల్ని, మీ లో ఉన్న మేధోశక్తి గమనించి మీకు ఆయన హృదయంలోనూ మరియు పార్లమెంటు లోనూ ఒక సింహాసనం ఇచ్చారు. మరి ఆయన వేసింది కనకపు సింహాసనమో కాదో తెలియదు కానీ మీరు మాత్రము శునకం లాగ తోక జాడిస్తున్నారు.

వై.ఎస్ వ్యక్తిత్వం తెలిసిన వాడు ఎవరూ, ఆయన చేయి చాచి అడుగుతారు అని అనుకోరు. కోట్ల, నేదురుమల్లి ఇలా ఎంతమంది ఆర్ధికం గా కొట్టినా ఎప్పుడూ తన కాళ్ళ మీద తను నిలబడ్డ వ్యక్తి మీ నాయకుడు వై.ఎస్ అని మీరు చాల సార్లు చెప్పారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా బెదరకుండా, గెలుపు వోటములకి తనదే బాధ్యత అన్న నాయకుడు, స్వంతగా గెలవలేని నాయకుని పొత్తుకోసం అర్రులు చాచి అమ్మ కి ఉత్తరం రాయటం నమ్మ శాక్యంగా లేదు. ఒక వేళ అలా రాసి మీ చేతపంపడం నిజమయినా, మీకు ప్రియతముడైన నాయకుడి ఉత్తరాని అలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మీ వ్యక్తిత్వానికే మచ్చ. మీకు నిబద్ధత, నిజాయితీ, క్రుతజ్ఞ్యత - ఇలాంటివి ఏవీ లేవని చెబుతున్నాయి.
చేసిన పాపం ఎప్పటికైనా చుట్టుకు తీరుతుంది. మీ పదవి ఇంకా మూడేళ్ళే. ఆ తరువాత దొండపాడు లో బెండ ముక్క కూడా ఉండదు మీకు. అప్పుడు రామోజీ, బాబు మీ కోసం కాచుకుని ఉంటారు. మీ అమ్మ కనీసం కన్నెత్తి కూడా చూడదు. ఇప్పుడు మీకింత కవరేజు ఇచ్చిన టీవీ 9 మిమ్మల్ని పట్టించుకోడు. కాంగ్రెస్స్ లో కలిసీ కలవగానే వై.ఎస్ మీద దుమ్మేత్తిన మీ కొత్త నాయకుడు ఫోను ఎత్తడు. అప్పుడు రక్త కన్నీరు లో నాగభూషణం లాగ కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. మీ కొత్త నాయకుడి సినిమా సామెత గుర్తొస్తోంది - మీ అందరికీ "Infront Crocodile Festival".