Sunday, February 6, 2011
అయ్యా ఉండవల్లి గారూ !
పాపం వై.ఎస్. - చెంత చేరినవారికి " వై (WHY?) అని అడగకుండా ఎస్ (YES) అనే వ్యక్తిత్వం ఉన్న గొప్ప మారాజు. ఎంత మందినో అనామకులను నాయకులు గా పెంచి పెద్దచేసిన రా రాజు. ఆయన మరణం తరువాత ఒక్కొక్కరే "నమ్మిన" బంటులందరూ ఆయన వ్యక్తిత్వాన్ని, ఆత్మని కుళ్ళబొడుస్తున్నారు. ఎన్ని aపవాడులోచ్చినా సరే వెన్నంటే ఉన్న వీరుడిని, ఆయన కుటుంబాన్ని మీరు వెన్ను పోటు పొడవటం చరిత్ర పుస్తకాల్లోకి ఎక్క వలసిన పాఠం. రాజన్నని అంత మంది అన్ని మాటలంటే బయటకి రాణి మీ మొగతనం, చిరునంటే పొడుచుకు వచ్చిందా? ఇంత దిగజారుడుతనం ఎందుకు? కనీసం వీ.హెచ్., కాకా వాళ్ళు తెలుగుదేశం లేని రోజుల్లో కాంగ్రెస్ టికెట్ మీద కుల బలంతోనో ధనబలం తోనో గెలిచారు. మీకు ఆ శక్తి కూడా లేదు. ఆ రోజుల్లోనే ఒక వార్డు కౌన్సిలర్ గా గెలిచుండే వారు కాదు. అలాంటి మిమ్మల్ని, మీ లో ఉన్న మేధోశక్తి గమనించి మీకు ఆయన హృదయంలోనూ మరియు పార్లమెంటు లోనూ ఒక సింహాసనం ఇచ్చారు. మరి ఆయన వేసింది కనకపు సింహాసనమో కాదో తెలియదు కానీ మీరు మాత్రము శునకం లాగ తోక జాడిస్తున్నారు.
వై.ఎస్ వ్యక్తిత్వం తెలిసిన వాడు ఎవరూ, ఆయన చేయి చాచి అడుగుతారు అని అనుకోరు. కోట్ల, నేదురుమల్లి ఇలా ఎంతమంది ఆర్ధికం గా కొట్టినా ఎప్పుడూ తన కాళ్ళ మీద తను నిలబడ్డ వ్యక్తి మీ నాయకుడు వై.ఎస్ అని మీరు చాల సార్లు చెప్పారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా బెదరకుండా, గెలుపు వోటములకి తనదే బాధ్యత అన్న నాయకుడు, స్వంతగా గెలవలేని నాయకుని పొత్తుకోసం అర్రులు చాచి అమ్మ కి ఉత్తరం రాయటం నమ్మ శాక్యంగా లేదు. ఒక వేళ అలా రాసి మీ చేతపంపడం నిజమయినా, మీకు ప్రియతముడైన నాయకుడి ఉత్తరాని అలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మీ వ్యక్తిత్వానికే మచ్చ. మీకు నిబద్ధత, నిజాయితీ, క్రుతజ్ఞ్యత - ఇలాంటివి ఏవీ లేవని చెబుతున్నాయి.
చేసిన పాపం ఎప్పటికైనా చుట్టుకు తీరుతుంది. మీ పదవి ఇంకా మూడేళ్ళే. ఆ తరువాత దొండపాడు లో బెండ ముక్క కూడా ఉండదు మీకు. అప్పుడు రామోజీ, బాబు మీ కోసం కాచుకుని ఉంటారు. మీ అమ్మ కనీసం కన్నెత్తి కూడా చూడదు. ఇప్పుడు మీకింత కవరేజు ఇచ్చిన టీవీ 9 మిమ్మల్ని పట్టించుకోడు. కాంగ్రెస్స్ లో కలిసీ కలవగానే వై.ఎస్ మీద దుమ్మేత్తిన మీ కొత్త నాయకుడు ఫోను ఎత్తడు. అప్పుడు రక్త కన్నీరు లో నాగభూషణం లాగ కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. మీ కొత్త నాయకుడి సినిమా సామెత గుర్తొస్తోంది - మీ అందరికీ "Infront Crocodile Festival".
Wednesday, September 16, 2009
వై. ఎస్. ధృవ తార
Thursday, September 3, 2009
అమరజీవి కి అశ్రుతర్పణం ..

ఏడవాలని ఉంది. కానీ కళ్లు సహకరించటం లేదు,
బాధ తో అరవాలని ఉంది. కానీ నా గొంతు సహకరించటం లేదు,
మరిచిపోవాలని ఉంది. కానీ మనస్సు సహకరించటం లేదు,
విశ్రమించాలని ఉంది, కానీ అన్నా నీ స్ఫూర్తి తో నా ప్రాణం సహకరించటం లేదు.
నాకు అర్థమైంది, నీకు నిజమైన శ్రద్ధాంజలి ఇవ్వాలంటే నీ బాటలో నడవాలి.
బాధలో ఏడవకూడదు, అరవ కూడదు, మరవ కూడదు, విశ్రమించ కూడదు.
నాకు తెలియకుండానే నా పంచ ప్రాణాలు నీ మార్గం లోకి నన్ను నడిపిస్తున్నాయి.
కానీ ఒక్క ప్రశ్న మాత్రం అడగాలని ఉంది, ఆ భగవంతుడిని. "ఎందుకు చేసావు ఇలా ?".
నీ స్ఫూర్తితో, మరొక్క నాయకుడు ముందుకి వచ్చి నీవు విడిచిన శూన్యాన్ని కొంతైనా నింపుతాడని ఆశతో
- నీ అభిమాని
Tuesday, July 7, 2009
రాజన్నషష్టి పూర్తి
Thursday, June 4, 2009
కంటి చూపు చాలునయ్యా, (చి)గున్నరాయుడూ !!

నందమూరి బ్రహ్మనాయుడు, తొడల సింహారెడ్డి బాలయ్య కి,
అయ్యా ,
ఈ మధ్య ఎలెక్షన్లలో ఆకాశం గర్జించిందా, భూమి కంపించిందా అనిపించేలా మీరు తోడకొట్టటం తో కలియుగాంతమేమో అని భయపడ్డాను. గత అయిదు సంవత్సరాలు కాంగ్రెస్సు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, తొడ కొట్టటం, మీసం తిప్పటంలో మీ వంశానికి మాత్రమే పేటెంట్లు ఉన్న విషయం మరచేపోయాను. అసలు కంటిచూపుతో చంపగల కెపాసిటి ఉన్నా (ఈ విషయం ప్రస్తావిస్తే, బెల్లంకొండ సురేషు "బాలయ్య కి అంత సీను లేదు, రివాల్వరు ఇచ్చినా చంపలేడు" అని అన్నాడు. ఆ విషయం బెల్లంకొండ కి ఎలా తెలుసో?) మీరు ఇలా చీపుగా ప్రతీ ఊరికీ వెళ్లి ఇలా నా లాంటి సామాన్యులని భయపెట్టేటట్టు తొడలు కొట్టటం ఏమీ బాలేదు.
అసలు తొడ కొట్టటం పౌరుషానికి చిహ్నము అని ఎవరు డిసైడు చేసారో కాని, అల నాటి దుర్యోధనుడి మొదలుకొని మీ దాకా అలా తొడలు కొట్టేయటం, మా లాంటి మానవ మాత్రులు భయంతో చావటం మొదలయ్యింది. ఆ దుర్యోధనుడు ఎవరో పరాయి స్త్రీ ముందు తొడ కొడితే, మీరు ఒక ఆకు ఎక్కువే చదివి సొంత చెల్లెలు ఇంటి ముందే కొట్టారు. ఈ విషయంలో మీరు దుర్యోధనుణ్ణి , మీ వంశం కౌరవ వంశాన్ని మించి పోయారు. మీరు అంత కష్టపడి, శివమణి డ్రమ్సు కొట్టినట్టు ఊరూరా తిరుగుతూ తొడలు కొట్టినా ఫలితాలు పెద్దగా తేడా రాలేదు. చరిత్ర చెప్పిందేమిటంటే ఇలా తొడలు కొట్టిన వాళ్ల తొడలు పగిలి, వారి వంశాలు నాశనం అవుతాయి అని. కాబట్టి, ఇలా వీధులలో తొడలు కొట్టకుండా, మీ శత్రువులని కంటి చూపుతో సైలెంటుగా లేపెయ్యండి . లేకపోతే ఇంటికి మందుకి పిలిచి మీ భార్య రివాల్వరు తో చంపండి. కేసు నుంచి తప్పించటానికి మీకు పిచ్చి ఉండనే ఉంది కదా. అలా కాకుండా ఇలా వీధుల్లో తొడలు కొడితే, ఎప్పుడో మీ తొడలు కూడా పగులుతాయి.
అందుకే
కంటి చూపు చాలునయ్యా, గున్నరాయుడూ !!
తొడలు కొట్టి చంపొద్దయ్యా, గున్నరాయుడూ !!
అని చిన్న విజ్ఞ్యప్తి....
భవదీయుడు,
శర్మ
Wednesday, May 27, 2009
రాఘవులు గారూ, జాలిం లోషన్ వాడండి ...

శ్రీ బోడపాటి వెంకట రాఘవులు (B.V. రాఘవులు) గారికి,
అయ్యా,
మీలాంటి ఎందరో మహానుభావుల వలన, మా తాతల కాలం లో సిద్ధాంత నిభద్దత కి మారు పేరయిన కమ్యూనిస్టులు నేడు రాద్ధాంత ప్రభుద్దులు గా మారిపోయారు. ప్రజలే మాకు ముఖ్యం, పోరాటమే మా తత్త్వం, సమ సమాజమే మా లక్ష్యం అని భావించాల్సిన మీరు మా మాటే మాకు ముఖ్యం, ఆరాటమే మా తత్వం, అధికారమే మా లక్ష్యం అనే రాజకీయ వ్యభిచారులు గా మారి పోయారు. గాలి వాటం, ఏ ఎండకా గొడుగు లాంటివి బాగా వంటపట్టించుకుని అధికారానికి ఉంపుడుగత్తెలు గా పరిణామం చెందారు.
లేకపోతే, అతి పెద్ద వర్గ తారతమ్యాలు సృష్టించిన తెలుగు దేశం తోను, చిన్నరాష్ట్రాలకు వ్యతిరేకం అనే మీ మూల సిద్ధాంతాలను వదిలేసి తె.రా.స. తోను కూటమి కట్టటం ఏమిటి? సిద్ధాంతాలే ప్రాణం గా భావించి పోరాటం చేయాల్సిన మీరు కాంగ్రెస్సుని ఓడించటమే మా లక్ష్యం అని చెప్పటం ఏమిటి? 'సామాజిక న్యాయం' మా ఎజెండా అన్న చిరంజీవి పార్టీ ని కనీసం పట్టించుకోకుండా, 'మా సామాజిక వర్గానికే న్యాయం' అనే పార్టీల తో పొత్తులు పెట్టుకోవటం ఏమిటి?
భవదీయుడు,
శర్మ
Friday, May 22, 2009
రాజగురువు మరో ప్రస్థానం - శ్రీ కృష్ణ జన్మస్థానం
మహా రాజ రాజశ్రీ 'రాజ గురు'వింద గారికి
అయ్యా,
అక్షరమే ఆయుధం అన్ననుడువడి లోని ఉపమానాలంకారం (Figurative Speech) ని వదిలేసి అక్షరాన్ని నిజం గానే ఒక ఆయుధంగా వాడి మీరు చేసిన ప్రజాస్వామ్య ఖూనీల తాలూకు పాపాలు పండినట్టున్నాయి. "నిజం లో వార్త లేదు, వార్త లో నిజం ఉండకూడదు" అని నమ్మి మీరు రాస్తున్న రాతలు మీ మెడ కి చుట్టుకుంటున్నాయి. రాజ్యాధికార నిర్ణేతను (King Maker) , చట్టాలకు అతీతుడను అని విర్ర వీగి మీరు నిర్మించిన చట్టవ్యతిరేక వ్యాపార సామ్రాజ్యాలు, వాటి భారానికి అవే కూలుతున్నట్టున్నాయి. లేకపోతే రాజకీయ దురంధరులనే కాళ్ళ బేరానికి తెచ్చుకున్న మీరు, ఆఫ్టరాల్ ఒక ఎం.పి (మీరు అన్న మాటలే సుమండీ) చేతిలో మూడు చెరువులు నీళ్లు తాగాల్సిన దుర్గతి ఏమిటో? పైగా ఆ చిన్న ఎం.పి ని ఓడించటానికి, ఆ ఎం.పి గారి నాయకుడిని రాష్ట్రం లోనూ, వారి పార్టీ ని కేంద్రంలోనూ వోడించి, మీ అస్మదీయులని కుర్చీ లో కూర్చోపెట్టటానికి మీరు రచించిన వ్యూహం పేక మేడలా కూలిపోవటం ఏమిటో? మీరు చెప్పిందే వేదం అని భావించాల్సిన అమాయక ప్రజలు మీ రాజశాసనాన్ని ధిక్కరించి మీ బద్ధ శత్రువులను గెలిపించటం ఏమిటో?
చిన్న పత్రికాధిపతి గా మొదలు పెట్టి మహోన్నత శిఖరాలను అధిరోహించిన మీ ప్రస్థానం, ఈ కృష్ణాష్టమి కి చేరేటట్టు ఉంది శ్రీ కృష్ణ జన్మ స్థానం. నైతిక విలువలని చెర పట్టిన మీలాంటి వారికి అదే సరియైన స్థానం.
భవదీయుడు,
శర్మ.