Friday, May 22, 2009

రాజగురువు మరో ప్రస్థానం - శ్రీ కృష్ణ జన్మస్థానం



మహా రాజ రాజశ్రీ 'రాజ గురు'వింద గారికి
అయ్యా,
అక్షరమే ఆయుధం అన్ననుడువడి లోని ఉపమానాలంకారం (Figurative Speech) ని వదిలేసి అక్షరాన్ని నిజం గానే ఒక ఆయుధంగా వాడి మీరు చేసిన ప్రజాస్వామ్య ఖూనీల తాలూకు పాపాలు పండినట్టున్నాయి. "నిజం లో వార్త లేదు, వార్త లో నిజం ఉండకూడదు" అని నమ్మి మీరు రాస్తున్న రాతలు మీ మెడ కి చుట్టుకుంటున్నాయి. రాజ్యాధికార నిర్ణేతను (King Maker) , చట్టాలకు అతీతుడను అని విర్ర వీగి మీరు నిర్మించిన చట్టవ్యతిరేక వ్యాపార సామ్రాజ్యాలు, వాటి భారానికి అవే కూలుతున్నట్టున్నాయి. లేకపోతే రాజకీయ దురంధరులనే కాళ్ళ బేరానికి తెచ్చుకున్న మీరు, ఆఫ్టరాల్ ఒక ఎం.పి (మీరు అన్న మాటలే సుమండీ) చేతిలో మూడు చెరువులు నీళ్లు తాగాల్సిన దుర్గతి ఏమిటో? పైగా ఆ చిన్న ఎం.పి ని ఓడించటానికి, ఆ ఎం.పి గారి నాయకుడిని రాష్ట్రం లోనూ, వారి పార్టీ ని కేంద్రంలోనూ వోడించి, మీ అస్మదీయులని కుర్చీ లో కూర్చోపెట్టటానికి మీరు రచించిన వ్యూహం పేక మేడలా కూలిపోవటం ఏమిటో? మీరు చెప్పిందే వేదం అని భావించాల్సిన అమాయక ప్రజలు మీ రాజశాసనాన్ని ధిక్కరించి మీ బద్ధ శత్రువులను గెలిపించటం ఏమిటో?

చిన్న పత్రికాధిపతి గా మొదలు పెట్టి మహోన్నత శిఖరాలను అధిరోహించిన మీ ప్రస్థానం, ఈ కృష్ణాష్టమి కి చేరేటట్టు ఉంది శ్రీ కృష్ణ జన్మ స్థానం. నైతిక విలువలని చెర పట్టిన మీలాంటి వారికి అదే సరియైన స్థానం.

భవదీయుడు,
శర్మ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.