Wednesday, May 27, 2009

రాఘవులు గారూ, జాలిం లోషన్ వాడండి ...


తాడిత పీడిత జన శ్రేయోభిలాషి, ఆంధ్ర కార్ల్ మార్క్స్
శ్రీ బోడపాటి వెంకట రాఘవులు (B.V. రాఘవులు) గారికి,

అయ్యా,
మీలాంటి ఎందరో మహానుభావుల వలన, మా తాతల కాలం లో సిద్ధాంత నిభద్దత కి మారు పేరయిన కమ్యూనిస్టులు నేడు రాద్ధాంత ప్రభుద్దులు గా మారిపోయారు. ప్రజలే మాకు ముఖ్యం, పోరాటమే మా తత్త్వం, సమ సమాజమే మా లక్ష్యం అని భావించాల్సిన మీరు మా మాటే మాకు ముఖ్యం, ఆరాటమే మా తత్వం, అధికారమే మా లక్ష్యం అనే రాజకీయ వ్యభిచారులు గా మారి పోయారు. గాలి వాటం, ఏ ఎండకా గొడుగు లాంటివి బాగా వంటపట్టించుకుని అధికారానికి ఉంపుడుగత్తెలు గా పరిణామం చెందారు.

లేకపోతే, అతి పెద్ద వర్గ తారతమ్యాలు సృష్టించిన తెలుగు దేశం తోను, చిన్నరాష్ట్రాలకు వ్యతిరేకం అనే మీ మూల సిద్ధాంతాలను వదిలేసి తె.రా.స. తోను కూటమి కట్టటం ఏమిటి? సిద్ధాంతాలే ప్రాణం గా భావించి పోరాటం చేయాల్సిన మీరు కాంగ్రెస్సుని ఓడించటమే మా లక్ష్యం అని చెప్పటం ఏమిటి? 'సామాజిక న్యాయం' మా ఎజెండా అన్న చిరంజీవి పార్టీ ని కనీసం పట్టించుకోకుండా, 'మా సామాజిక వర్గానికే న్యాయం' అనే పార్టీల తో పొత్తులు పెట్టుకోవటం ఏమిటి?

పేదలకి మేలు చేసే సబ్సిడీ పథకాలను అడగకుండానే ఇచ్చిన వై.ఎస్ కన్నా, సోషలిస్టు ఎజెండా తో వచ్చిన చిరు కన్నా మీకు సంస్కరణలు చేసిన బాబు ముద్దు అవటం, మీ కేంద్ర నాయకత్వాన్ని ఈ విషయం లో అంగీకరింప చేయటం చూస్తే తర్కం(లాజిక్) కనిపించటం లేదు. తరిచి చూస్తే మీకు కమ్యూనిస్టులకు ప్రియమైన వర్గ పోరాటం కంటే, 'కమ్మ'నైన సామాజిక వర్గ పోరాటమే ఇష్టం లా ఉంది. అప్పుడెప్పుడో కేశవ రావు (పి.సి.సి. మాజీ ప్రెసిడెంటు) గారు మీకు కులగజ్జి అన్నమాట నిజమేమో అనిపిస్తోంది. ఆ గజ్జి వల్లనే మీకు ఈ గోకుడు ఎక్కువైనట్టుంది. ఆ గజ్జి రాష్ట్రమంతా వ్యాపించి, ఉన్న ఒక్క సీటూ ఊడక ముందే కొంచెం జాలిం లోషన్ వాడండి. మీ గజ్జి నయం అయిన తరువాత కొంచెం బుర్ర కూడా వాడండి.

మీ గజ్జి మీ ఇష్టం. ఏదో చెప్పాలనిపించి చెప్పాను. "గజ్జి కి లేని దురద జాలిం లోషన్ కి ఎందుకు?" అంటారా, సరే మీకు రష్యాలో పట్టిన గతే ఆంధ్రా లో కూడా పడుతుంది.

భవదీయుడు,
శర్మ


Friday, May 22, 2009

రాజగురువు మరో ప్రస్థానం - శ్రీ కృష్ణ జన్మస్థానం



మహా రాజ రాజశ్రీ 'రాజ గురు'వింద గారికి
అయ్యా,
అక్షరమే ఆయుధం అన్ననుడువడి లోని ఉపమానాలంకారం (Figurative Speech) ని వదిలేసి అక్షరాన్ని నిజం గానే ఒక ఆయుధంగా వాడి మీరు చేసిన ప్రజాస్వామ్య ఖూనీల తాలూకు పాపాలు పండినట్టున్నాయి. "నిజం లో వార్త లేదు, వార్త లో నిజం ఉండకూడదు" అని నమ్మి మీరు రాస్తున్న రాతలు మీ మెడ కి చుట్టుకుంటున్నాయి. రాజ్యాధికార నిర్ణేతను (King Maker) , చట్టాలకు అతీతుడను అని విర్ర వీగి మీరు నిర్మించిన చట్టవ్యతిరేక వ్యాపార సామ్రాజ్యాలు, వాటి భారానికి అవే కూలుతున్నట్టున్నాయి. లేకపోతే రాజకీయ దురంధరులనే కాళ్ళ బేరానికి తెచ్చుకున్న మీరు, ఆఫ్టరాల్ ఒక ఎం.పి (మీరు అన్న మాటలే సుమండీ) చేతిలో మూడు చెరువులు నీళ్లు తాగాల్సిన దుర్గతి ఏమిటో? పైగా ఆ చిన్న ఎం.పి ని ఓడించటానికి, ఆ ఎం.పి గారి నాయకుడిని రాష్ట్రం లోనూ, వారి పార్టీ ని కేంద్రంలోనూ వోడించి, మీ అస్మదీయులని కుర్చీ లో కూర్చోపెట్టటానికి మీరు రచించిన వ్యూహం పేక మేడలా కూలిపోవటం ఏమిటో? మీరు చెప్పిందే వేదం అని భావించాల్సిన అమాయక ప్రజలు మీ రాజశాసనాన్ని ధిక్కరించి మీ బద్ధ శత్రువులను గెలిపించటం ఏమిటో?

చిన్న పత్రికాధిపతి గా మొదలు పెట్టి మహోన్నత శిఖరాలను అధిరోహించిన మీ ప్రస్థానం, ఈ కృష్ణాష్టమి కి చేరేటట్టు ఉంది శ్రీ కృష్ణ జన్మ స్థానం. నైతిక విలువలని చెర పట్టిన మీలాంటి వారికి అదే సరియైన స్థానం.

భవదీయుడు,
శర్మ.

Monday, May 18, 2009

'చంద్రు'నికో చక్రం


అపర చాణుక్యులు, ఆంధ్ర ex. CEO
శ్రీ చంద్ర బాబు నాయుడు గారికి.
అయ్యా ,
మీరు రాష్ట్రం లో మరియు కేంద్రములో చక్రం బాగా తిప్పి అలసినారని తెలుగు ప్రజలు
మీకు విశ్రాంతి కలిపించారు. కనీసం కేంద్రం లో కూడా అవకాశం దొరకనివ్వ లేదు.
కాని మీకు విశ్రాంతి కంటే చక్రం తిప్పటం చాల మక్కువ అని తెలిసిన వాడిని నేను. అందుకే
మీరు ఈ అయిదు సంవత్సరాలు ఖాళీగా కూర్చోకుండా మీకు ఉడతా భక్తిగా ఈ చిన్న
చక్రం సమర్పించు కుంటున్నాను.

ఎప్పటి లాగే ప్రతిపక్ష భాద్యత ను మీ రాజగురువు కి అప్పగించండి. మీ బాబు లోకేష్ కి
వేరే దేశాల నుంచి అమలు సాధ్యం కాని పధకాలు తెలుసుకుని రమ్మనండి. మీ బావ మరుదులను,
వారి పిల్లలని ఊరిమీదకు తొడలు కొట్టడానికి పంపండి. మీరు మాత్రం హాయి గా ఈ చక్రం తో రోజంతా
ప్రాక్టీస్ చేసి, రాత్రంతా అధికారం మీదే అని కలలు కనండి. ఏమో, 2014 నాటికి మీకు ప్రజలు ఎంత పెద్ద
చక్రం ఇస్తారో ?

భవదీయుడు
శర్మ.

రాజ 'గురు'విందా !

ఓ రాజ 'గురు'విందా !!
నీ దూల తీరిందా ?
కూటమి పని గోవింద
ఇంక పెడతారు నీ బొంద ...

Saturday, May 16, 2009

కల చెదిరిందే !!

మహా 'కుల'యెన్సు కల చెదిరింది
రామోజీ గాడి గుండె అదిరింది
బాబు గాడి బొల్లి ముదిరింది
వీళ్ళ పెళ్లి ఇంకా ముందుంది

సరి లేరు నీకెవ్వరూ !!

సరి లేరు నీకెవ్వరూ !! రాజశేఖరా సరి లేరు నీకెవ్వరూ
సిరిలోన కానీ మగసిరిలోన కానీ