తాడిత పీడిత జన శ్రేయోభిలాషి, ఆంధ్ర కార్ల్ మార్క్స్
శ్రీ బోడపాటి వెంకట రాఘవులు (B.V. రాఘవులు) గారికి,
అయ్యా,
మీలాంటి ఎందరో మహానుభావుల వలన, మా తాతల కాలం లో సిద్ధాంత నిభద్దత కి మారు పేరయిన కమ్యూనిస్టులు నేడు రాద్ధాంత ప్రభుద్దులు గా మారిపోయారు. ప్రజలే మాకు ముఖ్యం, పోరాటమే మా తత్త్వం, సమ సమాజమే మా లక్ష్యం అని భావించాల్సిన మీరు మా మాటే మాకు ముఖ్యం, ఆరాటమే మా తత్వం, అధికారమే మా లక్ష్యం అనే రాజకీయ వ్యభిచారులు గా మారి పోయారు. గాలి వాటం, ఏ ఎండకా గొడుగు లాంటివి బాగా వంటపట్టించుకుని అధికారానికి ఉంపుడుగత్తెలు గా పరిణామం చెందారు.
లేకపోతే, అతి పెద్ద వర్గ తారతమ్యాలు సృష్టించిన తెలుగు దేశం తోను, చిన్నరాష్ట్రాలకు వ్యతిరేకం అనే మీ మూల సిద్ధాంతాలను వదిలేసి తె.రా.స. తోను కూటమి కట్టటం ఏమిటి? సిద్ధాంతాలే ప్రాణం గా భావించి పోరాటం చేయాల్సిన మీరు కాంగ్రెస్సుని ఓడించటమే మా లక్ష్యం అని చెప్పటం ఏమిటి? 'సామాజిక న్యాయం' మా ఎజెండా అన్న చిరంజీవి పార్టీ ని కనీసం పట్టించుకోకుండా, 'మా సామాజిక వర్గానికే న్యాయం' అనే పార్టీల తో పొత్తులు పెట్టుకోవటం ఏమిటి?
పేదలకి మేలు చేసే సబ్సిడీ పథకాలను అడగకుండానే ఇచ్చిన వై.ఎస్ కన్నా, సోషలిస్టు ఎజెండా తో వచ్చిన చిరు కన్నా మీకు సంస్కరణలు చేసిన బాబు ముద్దు అవటం, మీ కేంద్ర నాయకత్వాన్ని ఈ విషయం లో అంగీకరింప చేయటం చూస్తే తర్కం(లాజిక్) కనిపించటం లేదు. తరిచి చూస్తే మీకు కమ్యూనిస్టులకు ప్రియమైన వర్గ పోరాటం కంటే, 'కమ్మ'నైన సామాజిక వర్గ పోరాటమే ఇష్టం లా ఉంది. అప్పుడెప్పుడో కేశవ రావు (పి.సి.సి. మాజీ ప్రెసిడెంటు) గారు మీకు కులగజ్జి అన్నమాట నిజమేమో అనిపిస్తోంది. ఆ గజ్జి వల్లనే మీకు ఈ గోకుడు ఎక్కువైనట్టుంది. ఆ గజ్జి రాష్ట్రమంతా వ్యాపించి, ఉన్న ఒక్క సీటూ ఊడక ముందే కొంచెం జాలిం లోషన్ వాడండి. మీ గజ్జి నయం అయిన తరువాత కొంచెం బుర్ర కూడా వాడండి.శ్రీ బోడపాటి వెంకట రాఘవులు (B.V. రాఘవులు) గారికి,
అయ్యా,
మీలాంటి ఎందరో మహానుభావుల వలన, మా తాతల కాలం లో సిద్ధాంత నిభద్దత కి మారు పేరయిన కమ్యూనిస్టులు నేడు రాద్ధాంత ప్రభుద్దులు గా మారిపోయారు. ప్రజలే మాకు ముఖ్యం, పోరాటమే మా తత్త్వం, సమ సమాజమే మా లక్ష్యం అని భావించాల్సిన మీరు మా మాటే మాకు ముఖ్యం, ఆరాటమే మా తత్వం, అధికారమే మా లక్ష్యం అనే రాజకీయ వ్యభిచారులు గా మారి పోయారు. గాలి వాటం, ఏ ఎండకా గొడుగు లాంటివి బాగా వంటపట్టించుకుని అధికారానికి ఉంపుడుగత్తెలు గా పరిణామం చెందారు.
లేకపోతే, అతి పెద్ద వర్గ తారతమ్యాలు సృష్టించిన తెలుగు దేశం తోను, చిన్నరాష్ట్రాలకు వ్యతిరేకం అనే మీ మూల సిద్ధాంతాలను వదిలేసి తె.రా.స. తోను కూటమి కట్టటం ఏమిటి? సిద్ధాంతాలే ప్రాణం గా భావించి పోరాటం చేయాల్సిన మీరు కాంగ్రెస్సుని ఓడించటమే మా లక్ష్యం అని చెప్పటం ఏమిటి? 'సామాజిక న్యాయం' మా ఎజెండా అన్న చిరంజీవి పార్టీ ని కనీసం పట్టించుకోకుండా, 'మా సామాజిక వర్గానికే న్యాయం' అనే పార్టీల తో పొత్తులు పెట్టుకోవటం ఏమిటి?
మీ గజ్జి మీ ఇష్టం. ఏదో చెప్పాలనిపించి చెప్పాను. "గజ్జి కి లేని దురద జాలిం లోషన్ కి ఎందుకు?" అంటారా, సరే మీకు రష్యాలో పట్టిన గతే ఆంధ్రా లో కూడా పడుతుంది.
భవదీయుడు,
శర్మ
భవదీయుడు,
శర్మ
Sarma Garu...
ReplyDeleteAdaragottaru...As Usual...
super sarma gaaaru
ReplyDelete